Monday, May 17, 2010

నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ శెలవలు




మొత్తానికి నన్ను తీసుకెళ్ళి ఇంటర్ కోసం హాస్టల్ లో పడేసారు.మొదటి సారి హాస్టల్ లో ఉండటము,ఏదో టేస్ట్ తో ఉండే ఆ భోజనం,హోం సిక్ వగైరాలు ఒక 2-3 నేలలు నా "ప్రేమ(?)" భావాలని డానినేట్ చెసేసాయి.ఇంటికి హోంసిక్ హాలిడేస్ కి వెళ్ళి వచ్చాకా కాస్త కుదుటపడి చదువు లో ద్రుష్టి పెడదామనుకుంటుండగా నేనున్నా అంటూ మళ్ళీ తన గోల మొదలు నా మనసులో.

చదువు మీద కాన్సంట్రషన్ తగ్గిపోతోంది అని అర్ధం అయ్యింది,కానీ ఎవరికీ చెప్పుకోలేని బాధ.

ఇంతలో ఒక బ్రహ్మాండమయిన ఐడియా వచ్చింది.మా కజిన్ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటాడు.వాడికి ఉత్తరం రాసేదానిని.హీరో గారి విషయాలు తెలుస్తాయేమొ అని.

మా కజిన్ నా కంటే ఒక 4 యేళ్ళు చిన్న.వాడు ఏదో సుత్తి అంతా రాసేవాడు ఈయన గారి గురించి తప్ప.ఒకరోజు కావాలని ఇంటి నంబర్ తప్పు వేసి మా కజిన్ కి ఉత్తరం పోస్టు చేసా.అది నా కలల రాకుమారుడి ఇంటికి వెళ్తే,అది తను చూసి నేను గుర్తొస్తానేమొ అని ఆశ.ఊహూ...ఇలా భారం గా మా కజిన్ "ఉత్తి" రాలతో రోజులు గడుపుతుండగా...ఒకరోజు మా కజిన్ తన ఉత్తరం లో "నువ్వు ఇంటి నంబర్ తప్పు వేసావు,అది మా ఇంటి పక్క వాళ్ళది,మర్చిపోయాను "తను" నిన్ను అడిగినట్లు చెప్పమన్నాడు" అని రాసాడు.అంతే,ఇక నా ఆనందం చూడాలి,తన గురించి ఆ మాత్రం న్యూస్ తెలిసి నందుకే "ఆజ్ మై ఊపర్" అని పాడుకున్నా...

ఇంటర్ ఫస్ట్ ఇయర్ శెలవలలో మా బామ్మ(బాబాయి) వాళ్ళ ఊరు వెళ్ళాము.తను కనిపించాడు.ఎంత ఆనందమో నాకు.ఏదో మాట్లాడాలి అనిపించేది కాని,మాట్లాడలేక పోయేదానిని.తన కోసం రెగ్యులర్ గా మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళేదానిని.నేను వచ్చాను అని తనకి తెలియడానికి నా ప్రయత్నాలన్నీ నేను చేసేదానిని.చెవిటి మాలోకానికి వినిపించేవి/కనిపించేవి కాదనుకుంటా అవన్నీ.తీరిగ్గా ఆర్చుకుని తీర్చుకుని వచ్చేవాడు.నన్ను ఇదివరకటి లాగే ఏడిపించేవాడు అంతే.తనలో ఏమీ మార్పు లేదు.మా బామ్మ వాళ్ళ ఇల్లు చిన్నది అని వంక పెట్టి అత్త వాళ్ళ ఇంట్లొనే ఉండేదానిని.కానీ బాబాయేమో రాత్రికి ఇంటికి వచ్చి నేను ఇంట్లో లేకపోతే శివాలెత్తేవాడు.

మా బాబాయి కోసం అప్పుడప్పుడు మా ఇంట్లొనే ఉండేదానిని బలవంతం గా.పొద్దున్నే మా బాబాయి బయటకి వెళ్ళగానే,తుర్ర్..మళ్ళీ అత్తా వాళ్ళ ఇంటికి.మా అమ్మ ఏమో ఎండ లో మిట్ట మధ్యాహ్నం ఇంటికి రాకు,బాబాయి నేను చెప్తాలే అనేది.ఆహా...ఇంక అడ్డు ఏముంది,స్వయానా మా అమ్మే పర్మిషన్ ఇచ్చాకా.


ఇంతలో మా అమ్మ,శెలవలు ఎందుకు అలా వ్రుధా చేసుకుంటావు,"తనతో" లెక్కలు ఏమయినా చెప్పిచ్చుకోచచ్చు కదా అంది తన ముందే.హీరో గారు లెక్కలలో "పండితుడు(?)" అని అప్పట్లో టాక్ ఆఫ్ ద టౌన్ లెండి. తనేమో వెంటనే
నా దగ్గర ఇంటర్ లెక్కల టెక్స్ట్ బుక్ ఉంది పెద్దత్తా,నేను ఇస్తాలే అన్నాడు.అసలయితే మా అమ్మ ఎవరి ముందయినా ఇలా అని ఉంటే శివాలెత్తేదానిని.కానీ...హీహీహీ....

ఆ టెక్స్ట్ బుక్ మీద నా పేరు రాసి చక్కగా బైండ్ చేసి ఇచ్చాడు.ఇప్పటికీ నా దగ్గర ఆ పుస్తం ఉంది తెలుసా..ఇది జరిగి 17 సంవత్సరాలు అవుతోంది.

హీరో గారితో లెక్కల పాఠాలు మళ్ళీ చెప్తానే.

అప్పుడు అలా చేసానా నేను,ఇప్పుడు మాత్రం ఎవరయినా ప్రేమా గీమా అంటే,ఛీ ఏమిటి ఈ పిల్లలు అప్పుడే ఇలాంటివి అంటాను.వేంఠనే మా వారు,ఏమోలే,పదో తరగతి లోనే మొదలవుతాయిట కొన్ని కధలు అని సన్నాయి రాగం అందుకుంటారు.నేను ఒకసారి అలా చూడగానే..ఆ...విన్నాను ఎక్కడో ఈ మధ్య అని మళ్ళీ సరిచేసుకుంటారు :)

11 comments:

Anonymous said...

బాగుంది!
మానస గారు మీ వారు లెక్కల మాస్టరె కదా

చెప్పాలంటే...... said...

mee vaaru annadi correcte kadaa manasa gaaru

sphurita mylavarapu said...

మీ టపా చదువుతూ హయ్యో హయ్యో ఆడ పిల్లలు కూడా వాళ్ళ ప్రేమ కబుర్లు ఎలా రాసేస్తున్నారో, కలికాలం అని బోల్డంత బాధ పడేస్తుంటే, చూసాను, హమ్మ మీ వారినే ప్రేమించారా :D

Ram Krish Reddy Kotla said...

హాయిగా ఉంది మీ ప్రేమ కథ...కొంచెం పెద్ద పెద్ద టపాలు రాయండి, అపుడే అయిపోయిందా అనిపిస్తుంది మరి :)...సో లెక్కల పాఠాలు మీ వారు చెప్పడానికి బదులు, మీరే ఆయనకీ ప్రేమ పాటలు చెప్పారేమో కదా :) :)

కవిత said...

Mee prema kadha chala bagundhi andi.Naku lekkalu ante chala istam....

manasa said...

@ కోనసీమ కుర్రాడు
కరెక్ట్ గా తప్పు గెస్ చేసారు :)

@ చెప్పలంటే,
ఏమిటండీ మీరు కూడా మరీను.అయినా అందరికీ నా అంత "మంచి(?)" అమ్మాయి దొరకద్దూ?

@ స్ఫురిత,
ఆ లైను టపా పోస్ట్ చేసాకా ఎడిట్ చేస్తూ యాడ్ చేసా..లేకపోతే..హమ్మ బాబోయ్ నన్ను ఎన్ని తిట్టుకునే వారో...పోనీ లెండి చేసిన పాపం చెపితే పోతుందంటారు..చెప్పేసారుగా పోయింది :))

@ కిషన్(కిషెన్),
ఇంతకీ మీ పేరు కిషన్ ఆ కిషెన్ ఆ?ఏదో ఒకటి ,నా టపా నచ్చినందుకు ధన్యవాదాలు.త్వరగా చెప్పెస్తే హమ్మా..మొత్తం వినెద్దామనే...మీరు సస్పెన్స్ లో పెట్టట్లేదూ మమ్మల్ని? :))

@బంగారం,
:))...మీ ప్రొఫైల్ ఫోటో సూపరు.మీ బ్లాగు ఇప్పుడే చూస్తున్నా.

సవ్వడి said...

మానస గారు! మీ కథ బాగుంది. మీరు ఎంత వేగంగా చెప్పేస్తే అంత వేగంగా వినేస్తాం.
ఈ " పాలకోవ " మీ బావే కదూ.. చూసారా ఎలా కనిపెట్టేసానో!

Sai Praveen said...

కిషెన్ గారి మాటే నాది కూడా. మీ కబుర్లు బావున్నాయి. అందులోను ప్రేమకథ. కాబట్టి మాకు ఎదురుచూడడం కష్టం మరి :)

మానస said...

సవ్వడి,సాయి ప్రవీణ్,
ధన్యవాదాలు నా పోస్టు నచ్చినందుకు.కొత్త టపా వేసా చూడండి.

గిరీష్ said...

అసలయితే మా అమ్మ ఎవరి ముందయినా ఇలా అని ఉంటే శివాలెత్తేదానిని.కానీ...హీహీహీ....

super :-)

subbareddy said...

chaduvutunnatta seapu haiga uvindi
sri
vlcellworld@yahoo.com