Thursday, May 27, 2010

ఒక "కొత్త" సంవత్సరలోకి అడుగుపెట్టా



తరువాత తెలిసింది మాకు,ఆ కాలేజీ కి రికగ్నిషన్ లేదు అని.కాలేజీ వాళ్ళని అడిగితే వచ్చేస్తుంది అన్నారు.కానీ మేము భయపడి కాలేజీ మార్చుకుందామనుకున్నాము.ఒక 2-3 సార్లు కౌన్సెలింగ్ కి వెళ్ళడం ఏదో కారణాలతో అది క్యాన్సిల్ అవ్వడం.విసుగొచ్చింది నాకు.హీరో వాళ్ళ ఊర్లో ఉన్నా కానీ తనని కలిసే ప్రయత్నం చెయ్యలేదు నేను.

కౌన్సెలింగ్ లేటు అవుతోందని పోనీ ఒక్కసారి ఆ కాలేజీ కి వెళ్ళి చూడమ్మా అన్నారు నాన్న.అమ్మో నేను వెళ్ళను అన్నాను.బామ్మ కూడా పోనీ లేరా,దానికి కావాల్సిన కాలేజీ వచ్చేవరకు ఇక్కడే ఉంటుంది లే అంది.ఖాళీ గా ఉండటం ఎందుకని కంప్యూటర్ కోర్స్లు లో జాయిన్ అయ్యా.అప్పటికి నాకు కంప్యూటర్ అసలు ఎలా ఆపరేట్ చేస్తారో కూడా తెలీదు.అలా క్లాసు లకి వెళ్ళి వస్తుండేదానిని.

ఇంతలో క్లాసు మొదలయ్యాయి అని తెలిసి కాలేజీ కి బయలుదేరా.బాబాయ్ వచ్చాడు దింపటానికి.వెళ్ళేటప్పుడు బామ్మ ఏడుపు.నాకూ కళ్ళ నీళ్ళు వచ్చాయి,మా బామ్మ ని వదిలి వెళ్తున్నందుకు కొంత,మరికొంత..మీకు తెలుసుగా ఎందుకో :).ఒక్క 2 రోజులు క్లాసు జరిగాయో లేదో శలవలు ఇచ్చారు.ఆనందం గా వచ్చేసా మళ్ళీ బామ్మ దగ్గరకి.

కంప్యూటర్ క్లాసులు కంటిన్యూ చేసా.క్లాసు కి వెళ్ళేటప్పుడో వచ్చేటప్పుడో ,అప్పుడప్పుడు హీరో కనపడేవాడు.అయినా నెగ్లెక్ట్ చేసేదానిని.అప్పుడప్పుడు బామ్మ ఇంటికి కూడా వచ్చేవాడు.మెల్లిగా మాట్లాడటం మొదలెట్టా.ఇక అది ఎంత వరకు వచ్చింది అంటే,నా ఇన్స్టిట్యూట్ అయిపోయే సమయానికి రెడీ గా ఉండేవాడు నన్ను పికప్ చేసుకోవడానికి.నన్ను మా ఇంట్లో దింపి,మా పిన్ని(బాబాయ్ భార్య) కి చెప్పవాడు,మీ అమ్మాయి అలా రోడ్ మీద వస్తూ కనపడింది,లిఫ్ట్ ఇచ్చా అని.ఎవరికీ అనుమానం రాలేదు ఇంట్లొ.అయినా అసలు ఏమయినా ఉంటే కదా అనుమానం వచ్చినా భయపడటానికి.ప్రేమ దోమా లేకపోయినా ఇద్దరి మధ్యా,అలా పరాయి వాళ్ళ తో వస్తే బాగోదు అని నాకు కూడా తెలుసు.అందుకే రోజూ రావద్దు అని చెప్ప.

మెల్లిగా ఫోను మాట్లాడుకోవడం మొదలెట్టాము.మా బాబాయి భోజనం చేసి పడుకోగానే తనకి ఫోను చేసేదానిని.అప్పటికి సెల్ఫోను అన్న పదమే తెలీదు ఇంకా మన దేశం లో.ల్యాండ్ లైను లోనే కబుర్లన్నీ.మా బామ్మ లక్కీ గా ఊరు వెళ్ళడం వల్ల,రూం లో ఒక్కదానినే ఉండేదానిని.అందుకని నాకు ఇబ్బంది ఉండేది కాదు తనతో మాట్లాడటానికి.

మొదట్లో ఒక గంట మాట్లాడుకునే వాళ్ళము,ఒక వారం రోజులకి 2 గంటలు మాట్లాడే దాకా వచ్చాయి రాత్రిళ్ళు ఫోను కబుర్లు.ప్రతీ రోజూ ఎదురు చూసేదానిని,నేనటే ఇష్టం అని చెప్తాడేమో అని..ఊహూ..బండ మనిషి అనుకున్నా.నాకు ఏమో తన మీద గత 6 సంవత్సరాల నుండీ ఉన్న ఇష్టం చెప్పెద్దామా అనిపించేది.కానీ భయం.

ఇద్దరమూ ఫోను మాట్లాడక పోతే ఉండలేనంత స్టేజ్ కి వచ్చాము.రాత్రి అలా నాతో కబుర్లు చెప్పినా మళ్ళీ పగలు మామూలుగా ఉండేవాడు అందరి ముందూ.

ఇంతలో క్రిస్మస్ వచ్చింది.క్లాస్ లేదు ఆపూట.అయ్యో,హీరో కనపడడే,కానీ కలవాలనిపిస్తోంది,ఎలా?ఇంతలో తనే వచ్చాడు.కాసేపు మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వెళ్తూ వెళ్తూ చెప్పాడు సాయంత్రం బయటకి వెళ్దాము,మీ పిన్ని కి చెప్పు అని.మరి మా తమ్ముళ్ళు అన్నాను.అందరినీ కాదు బయటకి తీసుకెళ్ళేది నిన్ను ఒక్క దానినే అన్నాడు.హమ్మో,ఏమిటి ఈ పిల్లాడి ధైర్యం మా ఇంట్లో చెప్పి తనతో బయటకి వెళ్ళడమే,ఇంకేమన్న ఉందా అనుకున్నా.ఎంత ఫ్రెండ్స్ గా మమ్మల్ని ఆమోదించినా కానీ అలా వెళ్తే బాగోదు అని తెలుసు.


సాయంత్రం అయ్యింది.తను వస్తే బాగుండు,మాట్లాడచ్చు అనుకున్న.సాయంత్రం వచ్చి,ఏమిటి ఇంకా రెడీ అవ్వలేదు,పొద్దున్న చెప్పా గా అన్నాడు.నేను షాక్ ఏమిటి ఇలా అందరి ముందూ అని.

మా పిన్ని దగ్గరకి వెళ్ళి,తనని బయటకి తీసుకెళ్తా కాసేపు అన్నాడు.మా పిన్ని సరే అంది.నాకు భయం గానే ఉంది కానీ,అలాగే బయలు దేరా తనతో.

ఐస్ క్రీం పార్లర్ కి తీసుకెళ్ళాడు.ఏదో సుత్తి చెప్తాడు అంతే.ఏమయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అన్నాడు,అబ్బే ఏఅమీ లేదు అన్నాను.సరే,మరి త్వరగా తిను బయలుదేరుదాము అన్నాడు.ఉసూరు మనుకుంటూ ఇంటికి వచ్చా.ఆరోజు రాత్రి మళ్ళా ఫోను కబుర్లు మామూలే.

ఇంతలో న్యూ ఇయర్ వచ్చింది.ఎవరు ఫస్టు విషెస్ చెప్తారు అని పందెం పెట్టుకున్నాము.తనకి నేను ఫోను చేసా.ఫోను ఎత్తి గొంతు మార్చి హలో అన్నాడు.ఎవరికో చేసా అనుకుని,హెలో అన్నా నేను మళ్ళీ.అంతే,హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి,చూసావా నేనే గెల్చా అన్నాడు.ఎందుకో ఈ సారి అంత కోపం రాలేదు.ఒక 3 రోజులలో.....బాంబు పేలబోతోంది అని తెలీదు కదా మరి :)

12 comments:

చెప్పాలంటే...... said...

2 rojula nunchi mee blog kosam vedukuitune vunna eppudu pattukunnaa...baaga rastunnaru baavundi

మధురవాణి said...

మానస గారూ,
మీ ప్రేమకథంతా మొదటి నుంచీ చదువుకుంటూ వచ్చానండీ! చాలా బాగుంది. మీరు చాలా బాగా రాస్తున్నారు. ఆ బాంబేంటో త్వరగా చెపుదురూ... నాకు టెన్షన్ వచ్చేస్తోంది ఈ సస్పెన్సుకి ;-)

cbrao said...

కధ చెపుతున్న వైనం ఆసక్తికరంగా ఉంది.

Unknown said...
This comment has been removed by the author.
Unknown said...

మానస గారు మీరు పాలకోవా ని పేరు పెట్టి మిరపకాయి బజ్జీలు తినిపిస్తున్నారు అండి. మీ బ్లాగ్ ఇ రోజే చూసాను, ఆఫీసు లో పని మానేసి అలా చదువుతూ... అలా అలా ఎక్కడో పాత బోషణం పెట్టిలో పెట్టిన చిన్న నాటి ఆ తీపి గురుతులు.... అన్ని గుర్తుకు తెచుకొని నా పని అటక ఎక్కించాను. మీరు ఇంకో 3 రోజుల్లో బాంబు పేలుతుంది అన్నారు. కానీ నా బుర్రలో ఇప్పుడే పేలుతున్నాయి. తెలుగు సినిమాల్లో చూపించిన ట్విస్ట్లు అన్ని వుహించుకుంటున్నాను. ఆ పోస్ట్ ఏదో తొందరగా రాసేయండి. అది చదవక పొతే ఆ నాటి సావిత్రి నుండి ఇ నాటి స్నేహ వరకు వాళ్ళ సినిమాల్లో వచ్చిన ట్విస్ట్లు వుహించాలి.
మనలో మన మాట ఇంత బాగా రాయడం ఎలా & ఎక్కడ నేర్చుకున్నారు. నేను ఎవ్వరికి చెప్పను. నాకు చెప్పండి నేను ట్రై చేస్తాను
మోహన్

Ram Krish Reddy Kotla said...

మానసక్కా, ఇంతకీ ఏం బాంబ్ పేలనుంది??...ఆటం బంబా..ఏకంగా నూక్లేర్ బంబా..పెల్చండి త్వరగా ...:)

మానస said...

@ చెప్పలంటే,
థ్యాంక్సండీ :)

@ మధుర వాణి,
పెద్ద సస్పెన్స్ అదీ ఏమీ లేదు..కొత్త పోస్టు రాసా చూడండి
@ సీబీ రావు,
థ్యాంక్స్ అండీ :)

@అమ్మాయి కళలు ,
మిరపకాయ బజ్జీలు ఇంకా రాలేదు సార్ కధ లో,ముందు ముందు ఆ ఘాటు కూడా ఉంటుంది కధలో :)..ఇంతకీ భోషాణం లో దాచిన గుర్తులు అంటే..మీదీ సేం కధేనా ఏమిటీ?జరిగిన కధా యధా తధం గా రాస్తున్నా అండీ,మీకు నచ్చింది అంతే...స్పెషల్ ఏమీ లేదు

Ram Krish Reddy Kotla said...

మానస గారు, అందరికీ జవాబులు ఇచ్చి నాకు మాత్రం ఇవ్వలేదు...నేను అలిగేసానంతే :-(... అక్కా అని పిలిచాను అని కోపంతో ఇవ్వలేదా ?..ఎందుకో అలా పిలవాలి అనిపించి పిలిచాను...అంటే ...ఇంక అలా పిలవను లెండి ..

manasa said...

Kishan,
really I dont mean it..copy paste error.lekhini lo type chesi ikkada copy chesetappudu nee comment copy avvaledanukuntaa.....nenu ippude choosaa....ee saariki tapaa chadiveyandi alaka maani :)...

గిరీష్ said...

finishing bagundi..

mahesh.blogspot said...

nice expression

మానస said...

మహేష్ గారూ,
ధన్య వాదాలు