Wednesday, May 19, 2010
లెక్కల పాఠాలు మరి కాసిని కబుర్లు
అసలు నేను బామ్మ ఇంట్లో ఉండట్లేదు అని మా బాబాయి తిట్ల దండకం అందుకోవడంతో అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళడమే మానెసా.బామ్మ వాళ్ళింట్లో డాబా మీద పడుకునే వాళ్ళము అందరమూ.పొద్దున్నే లేచి వాళ్ళ ఇంటి వైపు చూసేదానిని.హీరో కాస్త బ్లర్ గా అయినా కనిపిస్తాడేమో అని.సార్ లేచి అలా కిందకి వెళ్ళిపోయేవాడే కాని,ఎప్పుడూ ఇటు చూసిన పాపాన పోలేదు.
లెక్కల పుస్తకం ఇచ్చి కాం గా ఊరుకోవచ్చు కదా,మా అమ్మకి కంప్లైంటు పైగా నేను చెయ్యట్లేదని.
ఇంతలో నా అద్రుష్టం పండి అప్పుడే అత్త వాళ్ళు కేబుల్ కనెక్షన్ తీసుకున్నారు.లోకల్ కేబుల్ టీవీ వాడు రాత్రిళ్ళు ఏవో సినిమాలు వేసేవాడు.తనకి కాలక్షేపం గా ఉంటుంది అని మా అత్త నన్ను అక్కడకి పంపమనేది మా మామయ్య ఊరు వెళ్ళారు అని.
అలా వాళ్ళింటికి వెళ్ళి,రాత్రి వరకు నేను,అత్త,వాళ్ళ అబ్బాయి బాబి,హీరో గారు ఏదో ఒకటి ఆడుకునేవాళ్ళము.9.30 కాగానే అత్త నిద్రొస్తోంది అంటూ డాబా మీద పడుకోవడానికి వెళ్ళిపోయేది.బాబి గాడు 10.30కి డౌన్.ఇద్దరమూ అలా చాలా సేపు కబుర్లు చెప్పుకుని,మధ్య మధ్య లో కాసిని లెక్కలు బలవంతం గా చేసేదానిని.
అలా సినిమా చూసాకా (నాకయితే అప్పుడు చూసిన ఒఖ్ఖ సినిమా కూడా గుర్తు లేదు కానీ ఈ కబుర్లు అన్నీ గుర్తున్నాయి.ఐరనీ ఏమిటి అంటే మా వారికి సినిమాలు మాత్రమే గుర్తు) నన్ను డాబా మీద దింపి తను అక్కడ నుండి గోడ దూకి వెళ్ళేవాడు.వాళ్ళింట్లో హీరొ గారొక్కరే పైన పడుకునే వారు లెండి,అందుకే అర్ధరాత్రి వరకు మా ఇంట్లో ఉన్నా కానీ వాళ్ళ ఇంట్లో తెలిసేది కాదు.
మా అత్త కూడా మీ బావ ఏడీ అనేది తన గురించి చెప్తూ.ఇంతకీ చెప్పలేదు కదూ,తను జస్ట్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ అంతే.కానీ చాలా యేళ్ళ నుండీ ఇరు కుటుంబాలకీ పరిచయం వల్ల మా ఇంట్లో వాళ్ళందరినీ వరసలు పెట్టి పిలిచేవాడు.ఇంతలో వాళ్ళ అక్క పెళ్ళి వచ్చింది.హీరో గారు బిజీ పెళ్ళి పనులతో.అసలు కలవడమే తక్కువయిపోతే ఇంకెక్కడి లెక్కలు?
హీరో బిజీ అయిపోయాడు అని చెప్పి అత్త వాళ్ళింటికి వెళ్లడమే మానేసా మొత్తానికి.ఏమయ్యింది నీకు,ఇంత సడెన్ గా,నాకు తోడు రావడం మానేసావు అని అత్త ఎన్ని సార్లు వచ్చి అడిగినా నేను రాను,మా అమ్మ దగ్గర ఉంటాను అనేదానిని.
ఏమిటొ ఇది,మొన్నటి వరకు అక్కడే ఉంటా అనేది,ఇప్పుడేమో అసలు వెళ్ళట్లేదు అని అమ్మ గొణుక్కుంది.
తను కనపడకపోయేసరికి ఎలాగో ఉండేది మనసు.ఎవరు ఏ చిన్న మాట అన్నా ఏడుపు తన్నుకు వచ్చేసేది.ఒకరోజు బామ్మ దగ్గరకి తీసుకుని,అలా ఏడుస్తావేమిటమ్మా,ఏదో అమ్మ ఈరోజు కోపం లో నాలుగు తిట్టిందని ఇలా ఇంతసేపు ఏడుస్తూ కూర్చుంటే ఎలాగ అంది.
ఆ మాత్రానికే కరిగిపోయి భోరుమని ఏడ్చి నా బరువు కాస్త దింపుకున్నా.కాస్త హాయిగా అనిపించింది ఆ పూట నాకు.అప్పుడు వేసవి కాలం మూలాన నీళ్ళ కొరత బాగా ఉండేది.బామ్మ ఇంటి వెనక మున్సిపల్ కుళాయి(నల్లా) వేళ కాని వేళ లో వచ్చేది.ఆ రోజు సాయంత్రం కుళాయి కోసం తలుపు తెరిచి కూర్చున్నా.
ఇంతలో హీరో స్కూటర్ మీద వస్తూ కనపడ్డాడు.నన్ను చూసి ఒక నిమిషం ఆగి మాట్లాడి మళ్ళీ బయలుదేరాడు. ఇంతలో బామ్మ వచ్చి,ఏమిటీ అసలు ఈ మధ్య కనపడటమే మానేసావు,రా లోపలకి అని తనదయిన శైలి లో ఆర్డర్ పారేసేసరికి మా ఇంటిని పావనం చేసారు హీరో గారు.
ఏదో అలా బలవంతంగా ఒక 10 నిమిషాలు కూర్చుని మళ్ళీ బయలుదేరాడు.కాస్త కాఫీ ఓ పాలో తాగి వెళ్ళు అని చెప్పి లోపలకి వెళ్ళింది తేవడానికి.ఆహా..ఈని రోజుల తరువాత తనతో మాట్లాడే అవకాశం..ఊహూ..నోరు పెగలదే...ఏంటీ మా అక్క పెళ్ళికి వస్తున్నావా లేదా అని అడిగాడు తనే.
రాను,నువ్వు నన్ను స్పెషల్ గా పిలిస్తే తప్ప అన్నా.సరే,రావద్దులే అంటూ మా బామ్మ తెచ్చిన పాల గ్లాసు అందుకుని గట గటా తాగి వెళ్ళొస్తా అమ్మమ్మా(మా బామ్మ ని అమ్మమ్మా అనేవాడు)పెళ్ళికి తప్పకుండా రండి,అమ్మ వాళ్ళు మళ్ళీ చెప్తారు అని బయలుదేరాడు.
మధ్యాహ్నం కాస్త భారం దిగి హమ్మయ్యా అనుకున్నానో లేదో మళ్ళీ మొదటికి వచ్చా తను వచ్చి వెళ్ళాకా.మొత్తానికి హీరొ అక్క పెళ్ళి వచ్చేసింది.
ఆ పెళ్ళిలో నేను హీరొగారితో కలిసి ఫోటో తీయించుకున్నా,మధ్యలో నాన్న అటూ ఇటూ మేమిద్దరమూ..ఇప్పటి లాగ వెంటనే ఫొటోలు వెంటనే వచ్చేవి కాదు కదా.కడీగి,ఉతికి బోలేడూ ప్రాసెస్ అయ్యాకా ఒక 20 రోజులకి వచ్చేవి,అదీ ఫోటొగ్రాఫర్ బిజీ కాకపోతే.
సో ఆ ఫోటో చూడకుండానే హాస్టల్ కి తిరిగి వెళ్ళిపోయా.
వాళ్ళ అక్క పెళ్ళి లో నా ఫొటో చూసి ఇప్పటికీ నవ్వు వస్తుంది నాకు.అంత అమాయకం గా నా ఫేసు కనిపిస్తోంది కానీ,మనసులో ఏముందో అప్పటికీ ఎవ్వరికీ తెలీదు.తెలిస్తే మా నాన్న కంటే ముందు బాబాయే తాట వలిచేసి ఇంట్లో అందరికీ లెదర్ పర్సులూ,బ్యాగులూ కుట్టేసేవాడు.ప్చ్చ్..లెదర్ పర్సులు బ్యాగులు మిస్స్ అయిపోయారు మా వాళ్ళు మొత్తనికి ఆ యేడాది.
పెళ్ళి అయ్యాకా హీరో మళ్ళీ వాళ్ళ అక్క వాళ్ళ అత్తగారింటికి,వాళ్ళతో పుణ్య క్షేత్ర సందర్శన లో బిజీ.
నేను తిరిగి వెళ్ళే రోజు వచ్చేసింది.అయినా కనపడడే.ఇక రేపు బయలుదేరతాము అనగా అమ్మ ఈరోజు సాయంత్రం అత్త వాళ్ళింటికి వెళ్ళి రేపు బయలుదేరుతున్నాము అని చెప్పి రా అంది.సరే అని అలా డల్ గా బయలుదేరా.
అత్త వాళ్ళింటికి వెళ్ళి అత్తతో కాసేపు మాట్లాడా.హాస్టల్ కి వెళ్తున్న అన్న దిగులు నీ మొహం లో తెలిసిపోతోందే,బెంగ పెట్టుకోకు బాబి గాడూ మేము ఉత్తరాలు రాస్తూ ఉంటాము అంటూ అత్త ధైర్యం చెప్పింది.నా దైన్యానికి కారణం ఎవరు తెలుసా అని అరవాలనిపించింది.
ఇంటి వెనక తులసి చెట్టు దగ్గర కూర్చుని నేను అత్త కబుర్లు చెప్పుకుంటోంటే ఇంతలో వాళ్ళ పక్కింటావిడ,అక్కయ్యగారూ కాస్త ఎవరయినా ఇంట్లో
ఉంటే పంపిస్తారా,అటక మీద సామానులు పెట్టడానికి సాయం కావాలి అంది. ఇంటి పక్కావిడ అంటే ఎవరనుకున్నారు..నాకు కాబోయే అత్తగారన్నమాట.అయినా హీరో అక్కడ లేడు కదా వెళ్ళి ఏమి ప్రయోజనం అని మాట్లాడలేదు.ఇంతలో అమ్మా! సామానులు ఇస్తున్నావా లేదా అని హీరో గారి గొంతు వినిపించింది.
నిజ్ఝం...నా ఆనందాన్ని వర్ణించాలి అంతే,....మ్మ్మ్...ఏమి ఉపమానం చెప్పను?
పాత సినిమాలలో హీరోయిన్ను హీరో ని చూడగానే ఆనందంతో స్లో మోషన్ లో అలా పెరుగెడుతుంది కదా,అలా అన్నమాట.
వేంఠనే,అత్తా నేను వెళ్తాను అన్నాను.ఆడపిల్లవి,నువ్వెలా చేస్తావు అంది.తను పైకి ఎక్కక్కర్లేదండీ,మా అబ్బాయి అటక మీదే ఉన్నాడు,కాస్త సామాన్లు అందిస్తే చాలు,నాకు అందట్లేదు అందావిడ.అత్త పర్మిషన్ ఇవ్వగానే గోడ దూకి వాళ్ళింట్లో కి వెళ్ళా..మా కాబోయే అత్తగారు అలా చూస్తూ ఉండిపోయింది,గేటూ తీసుకుని పొందిగ్గా ముందు నుండి వస్తాను అనుకుని ఉంటారు...
మొత్తానికి హీరో తో ఏమీ మాట్లాడటం కుదరలేదు,ఇటు అత్త,అటు కాబోయే అత్తగారు ఉండేసరికి.
పని అయిపోయాకా,వెళ్తున్నా ఆంటీ అని చాలా వినయం చెప్పి ముందు నుండి వెళ్ళబోతోంటే,మా అమ్మ ఇందాకే చూసింది గా,మళ్ళీ గోడ దూకి వెళ్ళచ్చు అని హీరో గారు వెనక నుండి అరుస్తున్నా పట్టించుకోకుండా చక్కగా గేటు తీసుకుని బయట పడ్డా.
ఆరోజు రాత్రి సడెన్ గా మా ఇంట్లో ప్రత్యక్ష్యం అయ్యాడు హీరో.ఏమిటి ఇలా వచ్చావు అన్నాను,మా పెద్దత్త(అంటే మా అమ్మ) వెళ్ళిపోతోందిట రేపు, చూసి వెళ్దామని వచ్చా అన్నాడు.
మా అమ్మతో కాసేపు మాట్లాడి,అత్తా వెళ్ళొస్తా అంటూ నా వైపు తిరిగి ఆల్ ద బెస్ట్ అంటూ స్కూటర్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు.
మొత్తనికి కొన్ని మధుర ఙాపకాలతో,హాస్టల్ కి తిరిగి వెళ్ళాను.కానీ ఆ లెక్కల పుస్తకం తెరిస్తే తనే గుర్తు వస్తోంటే,లెక్కలేమి చేస్తాను,కెమిస్ట్రీ ఏమి చదువుతాను.నా డల్ నెస్ గమనించి మా లెక్చరర్స్ నన్ను పాపం దగ్గరకి పిలిచి 1-2 సార్లు అడిగారు,ఈ మధ్య మరీ డల్ గా కనిపిస్తున్నావు ఏమిటి ఇంట్లో పెళ్ళి చేస్తాను అంటున్నారా ఏమిటి అని.ఏమి చెప్పాను వాళ్ళకి,ఇబ్బంది ఇంట్లొ వాళ్ళతో కాదు,నాతోనే అని.
ఒక పక్కేమో నాకేంటి ఈ ప్రేమ దోమా,నాన్సెన్స్ అనుకుంటూ మొత్తానికి అలా తన ఊహలతోనే ఇంటర్ కానిచ్చేసా.
మళ్ళీ ఇంట్లో తర్జన్స్ భర్జన్స్ ,డిగ్రీ ఎక్కడ చేయించాలి అని.ఒకానొక స్టేజ్ లో మా బాబాయి తన దగ్గర పెట్టమన్నాడు నన్ను.ఎగిరి గంతేసా,ఎందుకంటే అక్కడే తను కూడా ఉండేది మరి.అంత త్వరగా ఒప్పుకుంటే మా నాన్న ఎలా అవుతారు.మొహమాటం,ఒకరి మీద పిల్లలని ఎక్కువరోజులు వదిలేయకూడదు లాంటి సెంటిమెంట్లు భేషుగ్గ ఉన్న ఆయన ఒప్పుకోలేదు.ఇంతలో మా అక్క అడిగింది మా ఇంట్లో ఉంచుకుంటాను మీకు బాబాయి దగ్గర మొహమాటం అయితే అంది.ఊహూ...దానికీ ఒప్పుకోలేదు నాన్న.ఇంతలో పుణ్య కాలం కాస్త గడచిపోయి అన్ని కాలేజీలలో అడ్మిషన్ లు అయిపోయాయి.
మొత్తానికి తెలుసున్న వారి రికమండేషన్ ద్వారా హైదరాబాదు లో ఒక కాలేజీ అనుబంధ హాస్టల్ లో వేసారు.మళ్ళీ అక్కడా ఇదే గోల,కొన్ని రోజులు హోం సిక్,అడ్జస్ట్ అయ్యా అనుకుంటుండగానే ట్రోయ్ అంటూ తన గోల మొదలు.
(పెద్ద టపా రాయమన్నారని రాసేసా ఇలాగ.బాగా పెద్దదైపోతే చెప్పండే)
Subscribe to:
Post Comments (Atom)
14 comments:
పెద్ద టపా అని అస్సలు అనిపించలేదండి. అంత ఇంట్రస్టింగ్ గా ఉంది.
మానస గారు, నేను అడిగాను అని పెద్ద టపా రాసినందుకు ధన్యవాదాలు..ఇలాగే పెద్ద టపాలు రాస్తుండండి..సరేనా :-)...నా పేరు కిషన్ లేక కిషెన్ అని మీ డౌట్ కదా..రెండూ కాదు..నా పేరు రామకృష్ణ ..చాలా ఆసక్తి కలిగించేలా రాసారు ఎప్పటిలాగే :-)...మిమ్మల్ని అక్క అని పిలవాలని అనిపిస్తుంది..అలాగేనా మానసక్కా ..(నేను మీకంటే ఏడేళ్ళు చిన్నవాడినే లెండి..ఎలా చెప్పానో కనుక్కోండి చూద్దాం ..)..ఓకే అక్క మీ నెక్స్ట్ టపా కోసం ఎదురుచూస్తుంటా ...
మానస గారు,చాలా ఇంటరెస్టింగ్ గ ఉంది అండి మీ లవ్ స్టొరీ.మీకు కబుర్లు మాత్రమే గుర్తున్నాయి అన్నారు కదా....ఆ కామెంట్ సూపర్ అసలు.చక్కగా చెప్పారు మీ ఫీలింగ్స్.
నేను 8 వ తరవతి చదువుతుండేటప్పుడు సమ్మర్ లో డాబా మీద పడుకునేవాడిని...మాకు రెండు దాబాల అవతల ఒక అంకుల్ పచార్లు చేస్తూ కనపడేవాడు...మాకు ఒక డాబా ఇవతల ఒక అక్క అలాగే పచార్లు చేస్తుండెది కాకపొతే చేతిలో ఒక పుస్తకం ఉండేది..ఇప్ప్డు తెలిసింది అసలు కథ..వారే వీరన్న మాట..:)))
మానస గారు మీరు ఎక్కడికో తీస్కెళ్ళారు ...చాలా బాగుంది మీ ప్రేమ కథ.. వచ్చే టపా కోసం ఎదురు చుస్తూ...
avunu chaala teepiga vundi mee love story good
chala interesting andee
మీరు అన్ని కష్టాల్లోనూ inter ఎలా గట్టెకించేసారూ అని...
మీరు అసలు ఇలా టపాలు టపాలు గా కాకుండా...ఒకటే మినీ నవలగా రాసేస్తే మాకు ఈ suspense బాధ తప్పుతుందని నా వుద్దేశం...సలహా అన్నీను. ఏమంటారు..:D
అన్యాయం,అక్రమం నేను లేని టైములో ఇన్ని స్టోరీలు చెప్పేస్తున్నారా అందరికీ ..భలే రాస్తున్నారండి.. తర్వాత ఎమైంది ఇంతకూ :)
ఆ ఫొటొ ఎదొ పెట్టుంటె మీ హీరొ గార్ని మెము కూడ చూసెవాల్లం కదా మానస గారు
అన్నట్టు చాల ఇంట్రస్టింగ్ గా ఉంది మీ లవ్ స్టొరి! అయ్యొ పాపం అనిపిస్తుంది చదువుతుంటె మీ పరిస్థితి!
మీరుంచిన పాలకోవా ఫోటో చూస్తే పోయిన సక్రాంతికి గుంటూరులో నా స్నేహితుడి పక్కింటావడ పెట్టిన గొబ్బెమ్మలు గుర్తొచ్చాయ్, చాలా బావున్నాయండి.
మానస గారు! బాగుంది. నేనింకా మీ బావే అనుకున్నాను. బంధువులు కాబట్టి ఎక్కువ కష్టాలు లేకుండానే పెళ్లి జరిగుంటుంది అనుకున్నా! ఇప్పుడేమో పెద్ద తతంగమే జరిగి ఉంటుంది అనిపిస్తుంది.
టి.వి చూస్తున్నప్పుటి కబుర్లు చెప్పలేదేం..
సాయి ప్రవీణ్,కిషన్,
:),ధన్యవాదాలండీ నచ్చినందుకు
కవిత,
నేను పడ్డ బాధ మీకు సూపర్ గా ఉందా..అన్యాయం అండీ
రాజ్,
హీరో నాకోసం ఎప్పుడూ ఎదురు చూడలేదు.అంతా వన్వే నీ మా స్టోరీ కొన్ని యేళ్ళవరకు.సో ఆ డాబా జంట మేము కాదోచ్..:) టపా నచ్చినండుకు థ్యాంక్స్ అండీ..
అశొక్,మిరియప్పొడి
:),ధన్యవాదాలండీ నచ్చినందుకు
స్ఫురిత,
హమ్మ, మీరు అర్ధం చేసుకున్నారు నా కష్టం.నవల రాయచ్చు కానీ,టైపింగ్ ప్రాబ్లం అండీ.. ఈ చిన్న టపా కోసమే కొన్ని రోజులపాటు టైప్ చేస్తా :)
నేస్తం,
అలా కొన్ని రోజులు(సంవత్సరాలు)వన్ వే లో సా...గింది మా కధ.. :)
కోనసీమ కుర్రడు,
హీరో గారిని నేను రోజూ చూసి భయపడుతున్నా కదా,మిమ్మల్ని కూడా ఎందుకు భయపెట్టడం అని...:)..
అనానిమస్,
గొబ్బెమ్మలు గుర్తొచ్చాయి అంటే...?
సవ్వడి,
పెద్ద కధే నడిచిందండీ బాబూ.మరీ ఆ కబుర్లు కూడా చెప్తే బోర్ కొట్టిస్తానేమో అని...మధ్య మధ్య లో అలా ఒకోటీ చెప్తుంటా లెండి.
Good story
inter lo goda dookadam entandi :-)
Post a Comment