Monday, May 24, 2010

అలా చేరా పీజీ లో




హాస్టల్ లో సర్దుకోవడానికి నాకు ఒక 3-4 నెలలు పట్టింది మళ్ళీ ఇక్కడ కూడా.
కాకపోతే ఇదే ఊరు లో మా మామయ్య ఉండటం వల్ల కాస్త హోంసిక్ తగ్గింది.వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేదానిని.

చెప్పానుగా,తన ఆలోచనలు అసలు స్థిమితం గా ఉండనిచ్చేవి కాదు నన్ను.కానీ ఇంటర్ కంటే కూడా వ్యాపకాలు,ఫ్రెండ్సు పెరగటం తో కాస్త బెటర్ అన్నమాట.

కానీ బయటకి వెళ్ళినప్పుడు తన పేరు తో ఉన్న షాపు కనపడినా కానీ ఏదో తెలీని ఆనందం.మళ్ళీ వాళ్ళ ఇంటికి ఫోను చెయ్యాలంటే మాత్రం భయం.అప్పటికీ ఒకసారి మా మామయ్య వాళ్ళ ఇంట్లో నుండి తన ఇంటికి ఫోను చేసా.మా మామగారు ఎత్తారు.అంతే,దెబ్బకి పెట్టేసా.కానీ బిల్లు వస్తుంది గా నెలాఖర్లో.రానే వచ్చింది బిల్లు,ఒక 2-3 రూపాయల బిల్లే కానీ,ప్రతీ దానినీ భూతద్దం తో చూసే మా అత్తయ్య కళ్ళు పట్టేసాయి ఆ నంబర్ ని,పైగా తనవాళ్ళు ఎవరూ లేని ఊరు నెంబర్ అది.ఆ ఊరు కోడ్ అదీ చూసి నన్ను అడిగింది,నువ్వు చేసావా మీ బామ్మ వాళ్ళ ఊరు కదా ఇది అని.

చేసాను అని చెప్పాలంటే భయం,ఆరాలు తీసుందేమో ఆ నెంబర్ ఎవరిది అని.ఇంతలో మా మామయ్య వచ్చి,చేస్తే చేసిందేమో లేవే,వాళ్ళ బామ్మ గారికే గా చేసింది అని నన్ను ఒడ్డున పడేసాడు.

అంతే,మళ్ళీ ఎప్పుడూ ధైర్యం చెయ్యలేదు తనకి ఫోను చెయ్యటానికి.అదేమిటొ,శలవలలో కూడా అటు వెళ్ళలేదు ఒక ఏడాది మొత్తం.."ఇన్ఫాట్యుఏషన్" అనే పదం మొదటి సారి తెలిసింది నాకు ఆ హాస్టల్ లోనే.సో నాదీ అదే టైపు లే అనుకుని మళ్ళీ చదవాలి అని నిశ్చయించుకున్నాను.వీలయినన్ని యాక్టివిటీస్ పెట్టుకున్నా.హాస్టల్ లో తోటి పిల్లలని చూసి అనుకునేదానిని,ఈ ప్రేమ దోమా వేస్ట్ అన్నీ అని.

నా సెకండ్ యియర్ శెలవలలో ఆ ఊరు వీళ్ళాము మళ్ళీ.నేను కాస్త పెద్దవ్వడం మూలాన అబ్బాయిలతో క్రికెట్ అవీ మానేసి బుద్ధి గా ఉండేదానిని.ఇంతలో మా ఇంకో మేనత్త వాళ్ళు బాబాయ్ ఇంటికి ఎదురుగుండా ఇల్లు తీసుకున్నారు.ఆ మేనత్త కి ఒక కొడుకు సురేష్,వాడు నా కంటే ఒక 1 ఇయర్ పెద్ద.తనతో పెద్దగా మాట్లాడేదానిని కాదు.కానీ వాళ్ళ చెల్లి మాధురి నాకు చాలా క్లోజు.ఒక సారి మాటల్లో చెప్పింది,హీరో గారు తన బర్త్ డే కి అందరినీ సినిమా కి తీసుకెళ్ళాడు అని.హా,,ఛాన్స్ మిస్ అనుకున్నా.ఈ సురేష్,హీరో మాంచి ఫ్రెండ్స్ కానీ.సురేష్ కోసం హీరో వాళ్ళింటికి వస్తుండేవాడు.


హీరో ఇప్పుడు కూడా సరిగ్గా మాట్లాడేవాడు కాదు నాతో.సరిగ్గా అంటే,తిన్నగా.మాట్లాడితే అది నా మీద జోకో లేదా నన్ను టార్గెట్ చేసి ఏదో ఒకటి అనడమో.అదీ కాకపోతే అడిగిన దానికి ఒక్క ముక్క లో ఆన్సర్ అంతే.ఒకరోజు ఇలా జోక్ చెయ్యగానే ఏడ్చేసా,వచ్చి సారీ చెప్పి నేను మామూలు అవ్వగానే,తన పంధా మొదటికే.

ఇంక ఆ తరువాత డిసైడ్ అయిపోయా,ఈ మనిషి గురించి ఆలోచించి వేస్ట్.హాస్టల్ కి వెళ్ళి యమా సీరియస్ గా చదివా ఫైనల్ ఇయర్ కదా.

నా ఫైనల్ ఇయర్ లో ఒక 20 రోజులలో పరీక్షలు అనగా నాన్న కబురు,తిరుపతి వెళ్దాము రమ్మని.రాను అన్నాను,ఏమీ కాదు ఒక 3 రోజులలో వచ్చేస్తాము,పైగా ఇప్పుడు క్లాసులు ఏమీ లేవు కదా అని వప్పించి తిరుపతి తీసుకుళ్ళారు.


మా చిన్న మేనత్త వాళ్ళ ఫ్యామిలీ(మా నాన్నగరిది పేద్ద కుటుంబం లెండి),మా ఫ్యామిలీ,బామ్మ కలిసి వెళ్ళాము.అమ్మ,నాన్న,అత్త,బామ్మ పైకి బస్సు లో వెళ్ళారు,నేను మా మామయ్య నడచి బయలుదేరాము.మెల్లిగా కొండ ఎక్కి మా వాళ్లని కలవటానికి గుడి ఎదురుగుండా ఉండే మెట్ల దగ్గరకి వెళ్ళాము.అక్కడ...హీరో మా వాళ్ళతో కలిసి కబుర్లు చెప్తున్నాడు.నాకు అయితే నోట మాట పెగల్లేదు.ఏమిటి ఇది కలా నిజమా అని.

తిరుపతి కి దగ్గర్లో పీజీ చేస్తున్నాడు అప్పుడు తను,తరచుగా కొండకి వస్తుంటాడుట,ఈసారీ అలాగే వచ్చాను,మీరు కనిపించారు అన్నాడు.
తెలిసున్న వాళ్ల ద్వారా మాకు దర్శనం చాలా బాగా చేయించాడు.మా అమ్మ,బామ్మ అయితే ఫ్లాట్ అయిపోయారు అంత మంచి దర్శనం లభించినందుకు.

ఇంతలో మా మేనత్త తనకి చెప్పింది,మాకు తెలిసున్న వాళ్ళ పెళ్ళి ఫలానా చోట ఉంది,రేపు అక్కడకి రా అని.వస్తాడని అనుకోలేదు నేను.

మేమూ వెళ్ళాము ఆ పెళ్ళికి.నేను లోపల ఉన్నాను,తన మాట వినబడింది.ఎంత హ్యాపీ అంటే నేను......

దగ్గరకి వెళ్ళా మాట్లాదదామని.అందరమూ కూర్చుని కబుర్లు చెప్పుకున్నాము కాసేపు.కొంత సేపటికి అందరూ భోజనాలకి లేచారు.అప్పుడు అన్నాడు నాతో...

ఏమిటీ మీ వాళ్ళు నేను కనపడగానే,మానస అక్కడ ఉంది,మానస ఇప్పుడు వస్తుంది అని నీ గురించి ఇనఫర్మేషన్ ఇస్తారు?నిన్న మీ వాళ్లని కలిసానో లేదో,మీ మేనత్త "మానస నడచి వస్తోంది"అంది.నేను అడిగానా అందామనుకుని,పెద్దది కదా అని ఆగిపోయాను అన్నాడు.నీ గురించి రాలేదు నేను,అసలు నువ్వు వస్తున్నావని కూడా నాకు తెలీదు అనేసరికి నాకు ఎంత కోపం వచ్చి ఉంటుందో ఊహించుకోండి.

చిత్రం ఏమిటీ అంటే,మా వాళ్ళు అందరూ మా ఇద్దరినీ మంచి స్నేహితుల లాగ చూసేవారు.

సైట్ సీయింగ్ కి వెళ్దామని నాన్న అన్నారు.నేను,నాన్న తను బయలుదేరాము.బస్సు లో తన పక్కన కూర్చున్నందుకే ఎంత సంబర పడిపోయానో.ఇప్పటికీ నేను తిరుపతి వెళ్తే తన కోసం కొన్ని సంవత్సరాల క్రితం నేను పడ్డ వేదన గుర్తు వచ్చి నవ్వొస్తుంది.దేవుడా నేను కోరుకున్న మనిషి ని నాకు ఇచ్చావు అని థ్యాంక్స్ కూడా చెప్తాను.ఇద్దరమూ నాన్న తో కలిసి వెళ్ళిన ఆ సైట్ సీయింగ్ నాకు ఇప్పటికీ ఒక మధుర ఙ్నాపకం.

తరువాత మా కాటేజీ కి వచ్చాడు.నా హాస్టల్ నంబర్ అడుగుతాడేమో అని ఎదురు చూసా.ఆహా అడగడే.మీ కాలేజీ పేరేంటి అన్నాడు.పేరు చెప్పి,అబ్బాయిల ఫోన్లు మా హాస్టల్ లో ఎలో చెయ్యారు అన్నాను.నేను అడిగానా అన్నాడు.చిర్రెత్తుకొచ్చింది నాకు.ఛీ అనుకున్నా మళ్ళీ ఏ వెయ్యో సారో.కానీ నా బుద్ధి కుక్క తోక లాంటిది తన విషయం లో.హాయిగా మర్చిపోతున్నా అనుకున్నానా,కరెక్ట్ గా పరీక్షలప్పుడే కనపడేసరికి మొదటికొచ్చా.కానీ తనకి నా మీద ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదు అని డిసైడయిపోయి కసి గా చదివా పరీక్షలకి.మొత్తానికి పరీక్షలయ్యాయి.పీజీ ఎంట్రన్సు లతో బిజీ బిజీ.

పీజీ కౌన్సెలింగ్ కోసం వాళ్ళ ఊరు వెళ్ళాము.నాన్న తనని పిలిచి కాస్త కాలేజీ ల గురించి ఎంక్వయిరీ చెయ్యమన్నారు.సార్ మర్నాటి కల్లా కాలేజీ ల ఫీడ్ బ్యాక్ తో వచ్చాడు.ఆ కౌన్సెలింగ్ లో వాళ్ళ ఊరికి దగ్గర్లో సేటు వచ్చింది.

నేను చెప్పిన కాలేజీ లో ఎందుకు చేరలేదు అని అడిగాడు నేను తిరిగొచ్చాక.నాకు తెలుసు ఏది మంచిదో అని విసురుగా చెప్పా.కానీ నాకు తెలీదు ఆ కాలేజీ నా జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుందని.

9 comments:

అశోక్ పాపాయి said...

nice story:-)

Sai Praveen said...

చాలా ఇంట్రస్టింగ్ గా ఉందండి . ఇలా సస్పెన్స్ లో ఆపేస్తే ఎలాగ :)

sphurita mylavarapu said...

మీ వారు మిమ్మల్ని బాగానే ఏడిపించారన్నమాట...ఆ కసి అంతా ఇప్పుడు తీర్చేస్కుంటున్నారా...:)

..nagarjuna.. said...

చాలా బావున్నాయండీ మీ ప్రేమ కబుర్లు... సరదాగా,హాయిగా...
ఇంతకీ మీ హీరోగారి పేరు చెప్పనేలేదు ఇంతవరకు..

Ram Krish Reddy Kotla said...

మానసక్కా చాలా బాగున్నాయి మీ ప్రేమ కబురులు...కొంచెం త్వరత్వరగా రాసెయ్యండి..వెయిట్ చెయ్యడం కొంచెం కష్టంగా ఉంది...సో పీ.జీ లో ఏమయింది..చెప్పేయండి

Unknown said...

బాగుంది

ప్రియమైన నీకు సినిమా చూపిస్తున్నారు గా...

త్వరత్వరగా వ్రాసెయ్యండి మిగిలిన స్టొరి కూడా

సవ్వడి said...

బాగుంది.
తరువాత ఏమయ్యింది.

మానస said...

@అశోక్,సాఇ ప్రవీణ్
కొత్త టపా వేసా చూడండి :)
@ స్ఫురిత,
ఈ మగవాళ్ళు మనకి ఆ చాన్స్ ఇస్తారా చెప్పండి.పైగా నేను మంచి అమ్మాయినాయే :)

@ నాగార్జునా చారి,,
నా కబుర్లు నచ్చినందుకు ధన్యవాదాలు.చెప్తా చెప్తా..చాలా కామన్ పేరండీ అది,గెస్స్ చెయ్యండి పోనీ

@కిషన్,
పీజీ లో ప్రేమ మొదలయ్యిందన్నమాట :)

@ కోనసీమ కుర్రాడు
రాస్తునా రాస్తున్నా
@ సవ్వడి
నెక్స్ట్ టపా రాసా చూడండి :)

గిరీష్ said...

adentandi ee tapaa lo mee vaarini villian ni chesaru.. :-)