Monday, May 31, 2010

హమ్మయ్యా



మరునాడు పొద్దున్నే ఇంటికి వచ్చి అందరితో పాటూ నన్నూ మామూలుగా విష్ చేసాడు.ఆరోజు న్యూ ఇయర్ కాబట్టి నాకు క్లాసు లేదు. మధ్యాహ్నం,సాయంత్రం వచ్చి కాసేపు మాట్లాడి వెళ్ళాడు.రాత్రి ఫోను కబుర్లు యధా తధం.మరునాడు నాకు క్లాసు కి వెళ్ళాలనిపించలేదు.అన్యమనస్కం గా వెళ్ళొచ్చా.హీరో కూడా కనపడలేదు.ఇంతలో నా ఫ్రెండు ఫోను,క్లాసులు మొదలయ్యాయి,కాలేజీ కి రమ్మని.నా మనసు ఏమీ బాగాలేదు అప్పటికే. పిన్ని కి చెప్పా నేను ఎల్లుండి కాలేజీ కి వెళ్తున్నా అని.సడెన్ గా ఏమయ్యిందే,కాలేజీ మార్చుకునే దాకా వెళ్ళనన్నావు కదా అంది.క్లాసు లు మొదలయ్యాయిట వెళ్తున్నా,వీలున్నప్పుడు మార్చుకుంటా లే అన్నా.నీ ఇష్టం,మీ నాన్న కి ఫోను చేసి చెప్పు అంది.నాన్నగారికి కూడా చెప్పా,సోమవారం వెళ్తున్నా కాలేజీ కి అని.

మరునాడు ఆదివారం.క్లాసు లేదు.హీరో వాళ్ళ నాన్న గారు మా బాబాయి అందరూ ఇంట్లొ ఉండే రోజు.సో,నేను అత్తా వాళ్ళింటికి వెళ్ళినా తనతో మాట్లాడటం కష్టం.కానీ మాట్లాడాలనిపిస్తోంది ఎలాగ?.రేపే కాలేజీ కి వెళ్ళిపోతున్నా,మళ్ళీ తనతో మాట్లాడటం కుదరదేమో అని ఓ పక్క భయం.ఇక ఉండబట్టలేక సాయంత్రం అత్త వాళ్ళింటికి బయలుదేరా,వెళ్ళేసరికి హీరో అక్కడ కనపడగానే బోలేడు ఆనందం.కానీ బోలేడు మంది చుట్టూ,మాట్లాడలేను.అలా అంత మంది మధ్యలో కూర్చుని కూర్చుని కాసేపటికి విసుగొచ్చింది.ఏమిటే అలా ఉన్నావు,దీనికి హాస్టల్ కి వెళ్ళాలంటే ఎప్పుడూ దిగులే అంది అత్త.ఇక లాభం లేదు అని వెళ్తా అత్తా అని లేచాను.కూర్చో కాసేపు,మళ్ళీ ఎప్పుడొస్తావో అంది.నాకు ఉండాలని లేదు,అలా హీరో కళ్ళెదురుగా కనపడుతోంటే నరకం గా ఉంది నాకు.తను కూడా రోజూ లాగ ఉన్నట్లు లేడు అనిపించింది.ఎప్పుడూ నవ్వుతూ ఉందే తను ఏమిటో ముభావం గా అనిపించాడు.ఇంతలో తను నాకు ఒక్కదానికి మాత్రమే వినపడేలా హీరో అన్న మాట,కుర్చీ లో నుండి లేచిన నన్ను మళ్ళీ కూర్చునేటట్లు చేసింది.


ఎనీ గెస్,ఏమనుంటాడో?ఇన్ని సినిమాలు చూసారు కదా,గెస్ చెయ్యండీ.....
.
.
.
.
.
.
.
.
.
.
.


"ఐ నీడ్ యువర్ ప్రెజన్స్"....

ఈ మాట నన్ను కాసేపు అక్కడే కట్టి పడేసింది.కళ్ళలో నుండి నీళ్ళు వచ్చేసాయి ఆ మాట వినగానే.కాసేపు కూర్చున్నా కానీ మాట్లాడటం కుదరలేదు.ఇక లాభం లేదనుకుని 8 అవుతుండగా లేచాను.నేను దింపుతా ఇంటి దగ్గర అని తనూ లేచాడు.ఇంతలో అత్త తనకి వెరే పని చెప్పడంతో అదీ వీలు పడలేదు.ఆరోజు ఇంటికి చేరి బాబాయి ఎప్పుడు పడుకుంటాడా అని ఎదురు చూడటమే సరిపోయింది.రేపు వెళ్తున్నావుట కదా అన్నాడు,భోజనం చేస్తుండగా.అవును అన్నాను.నేను రానా అన్నాడు.వద్దులే,వెళ్ళగలను,దగ్గరే కదా అన్నాను.పోనీ బస్టాండు కి వెళ్ళేటప్పుడు లేపు అన్నాడు.వద్దు బాబాయ్,ఎందుకు శ్రమ,నాకు లగేజీ కూడా లేదు కదా,వెళ్తాలే,హాస్టల్ కి చేరి ఫోను చేస్తా అన్నాను.ఇలా చెప్పానే కానీ ఒప్పుకుంటాడో లేదో అని సందేహం.భోంచేస్తున్నంతసేపూ ఏమీ మాట్లాడలేదు.చేతులు కడుక్కుంటూ అడిగాడు,వెళ్ళగలవా,మళ్ళీ మీ నాన్న నన్ను కోప్పడతాడు అని.వెళ్తాను,ఇబ్బంది లేదు అన్నాను.హీరో ని బస్టాండు లో కలవచ్చన్న ఆశ కాస్త పెరిగింది.మా బాబాయి బస్టాండు కి వస్తే,తను రాలేడు కదా,ఎంత ఫ్రెండు అయితే మాత్రం అంత పొద్దున్నే నా కోసం వస్తే.......

మొత్తానికి బాబాయి పడుకున్న కాసేపటికి ఫోను కబుర్లు మొదలు. ఈ సారి ఎందుకో మామూలుగా అనిపించలేదు నాకు తన మాటలు.అలా తెల్లవారుఝాము మూడింటి వరకు మాట్లాడుకున్నాము.ఇక 2-3 గంటలే టైముంది.ఇక ఆగలేకపోయాను నేను.

ఐ కెనాట్ స్టే వితవుట్ యూ" అని చెప్పి ఏడ్చేసా.ఆరు సంవత్సరాలనుండీ నేను అనుభవిస్తున్న క్షోభ అంతా చెప్పి తనివితీరా ఏడ్చేసా.

తను ఒప్పుకుంటాడా లేదా అని కూడా ఆలోచించలేదు.అసలు ఏమీ ఆలోచించకుండా ఎంత తెలిసున్న అబ్బాయి అయితే మాత్రం అలా ఎలా చెప్పానో అని ఇప్పుడనిపిస్తుంది. "ఏడవకు అలాగ","ఓకే అయాం విత్ యూ", ఇలాంటి మాటల్తో ఇంకో 2 గంటలు గడిచాయి.

ఇంతలో నేను లేచి బయలుదేరాల్సిన సమయమయింది.అలా ట్రాన్స్ లో ఉన్నట్లు లేచి రెడీ అయ్యి బస్టాండుకి చేరా.తను వచ్చాడు.నాకు ఏమో కళ్ళ నీళ్ళు ఆగట్లేదు.ఏమిటో తెలీని దుఖ్ఖం.నేను జీవితం లో అలా ఏడవటం మొదటి సారి చివరి సారి కూడా.ఏమిటి ఇలా బేల గా అయిపోయావు అన్నాడు.నాకూ ఆశ్చర్యం గానే ఉంది నేను ఇలా ఏడుస్తున్నానంటే అన్నాను.

ఇంతలో బస్సు రావడం తో ఎక్కి కూర్చున్నా.పెద్ద రష్ లేదు బస్ లో.ఒక కిటికీ పక్క సీటు తీసుకుని అలా మా కాలేజీకి చేరేవరకు నా కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి.హాస్టల్ కి వెళ్ళా.అక్కడ నా ఫ్రెండు నాగమణి వెయిటింగ్.ఏమిటి మానసా అలా ఉన్నావు అంది.ఏమీ లేదు,హాస్టల్ కి వచ్చా కదా అందుకే అన్నా.అదేంటి నీకు అలవాటే కదా 5 సంవత్సరాలనుండీ,నువ్వే అలా అయిపోతే,నేను మొదటి సారి హాస్టల్ కి వచ్చా,నేను ఎలా అంది.నేను ఏమీ మాట్లాడకుండా రూం సర్దుకోవడం లో మునిగిపోయా.హీరో గురించి మాత్రం చెప్పలేదు.కాసేపటికి అడిగా,నేను ఫోను చెయ్యాలి,వస్తావా అని.ఏమనుకుందొ బయలుదేరింది.దారిలో మొత్తం చెప్పేసా.షాక్ తను.ఏమిటే నువ్వు,అని.నా వల్ల కాలేదు,అందుకే ఆ అబ్బాయికి చెప్పేసా అన్నాను.నీ ఇష్టం,చిన్న పిల్లవి కాదు నువ్వు అంది.


హీరో కి కాల్ చేసా.ఎంత షేపు మాట్లాడానో తెలీలేదు.కాసేపటికి తను అన్నాడు,నువ్వు పెట్టేయి,ఆ ఎస్టీడీ బూతు వాడీ నంబర్ తీసుకో నేనే చెస్తా అని.ఆ షాపతన్ని అడగ్గానే,ఇన్ కమింగ్ చార్జ్ చేస్తా అన్నాడు.ఎంత అని అడిగా,నిమిషానికి రూపాయి అన్నాడు.సరే అన్నాను.ఇక మొదలు మేము టెలిఫోను డిపార్ట్ మెంటు ని మేపడం.ఆరోజు ఫోనులో చెప్పాడు,నువ్వు ఇలా బేల గా అవ్వడం బాలేదు.కాస్తం కుదుట పడు ముందు.నేను నీతోనే ఉంటాను,బాగా చదువుకో,పెద్ద మామయ్య(మా నాన్నగారు)ఎంత హోప్స్ తో నిన్ను పీజీ జాయిన్ చేసారో తెలుసు కదా.ముందు చదువుకో.ఇలా ఇలా మా మాటల ప్రవాహం ఒక గంట సాగింది.పాపం అంత సేపూ మా నాగమణి అలా బయట దిక్కులు చూస్తూ నిల్చుంది.

ఆఖరున ఫోను పెట్టేసే ముందు చెప్పాడు,నువు నాకు రేపు ఫోను చెయ్యకు.బాగా సెన్సిటివ్ గా ఉన్నావు.నేనే మీ హాస్టల్ కి ఒక 3 రోజులు ఆగి చేస్తాను అని.అస్సలు ఒప్పుకోలేదు ముందు నేను.కానీ ఒప్పించాడు చివరకి.

( అసలు కధంతా ఇక్కడనుండే మొదలు...హాయిగా కొన్నాళ్ళపాటు అటూ ఇటూ ఎగిరిన ఉత్తరాలు,ఫోను కబుర్లూ,కొన్ని రోజులకి ఇంట్లో తెలియడం......)

11 comments:

Naresh said...

కామెడీ, సస్పెన్స్ లను సమపాళ్లలో కలిపి నడుపుతున్న కథలో ట్రాజెడీ.... :(

నాకొక డౌటు... నేను ఇంటర్ చదివే రోజుల్లో సినిమాలకు ఒక ఫార్ములా వుండేది. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ, సెకండ్ హాఫ్ బిగినింగ్‌లో ట్రాజెడీ... ఆడియోలో వున్న ఆరు పాటల్లో ఒకటి స్లో బిట్, ఒకటి సాడ్ బిట్... ఇలా వుండాలి అని... మీరు లైఫ్‌లో కూడా అదే ఫార్ములా ని ఫాల్లో అయినట్టున్నారు?!?!?!

Anonymous said...

తీపి గురుతులా ?
మరి కనీ పెంచిన తల్లి తండ్రులు ని నిర్లక్ష్యం చేస్తారా ?
మీరు అమ్మాయి కాబట్టి ఎలాగోలా ఒప్పించొచ్చు
అదే అబ్బాయి ముందు డబ్బు ఉద్యోగం సంపాదించి అప్పుడు గానీ ప్రేమ ని నిలబెట్టుకొలేదు
మీకు ఉద్యోగం వచ్చినా మీది స్వచ్చమైన ప్రేమ కాబట్టి మీరిద్దరూ ఒకే దగ్గర ఉండొచ్చు హాయిగా

ఇంత గాడమైన ప్రేమ ను చూస్తుంటే
ఇప్పుడు మీరు ఇద్దరూ పెళ్లి చేసుకొనే వుంటారు
అంత భయంకరంగా ఉంది మీ ప్రేమ

Padmarpita said...

హమ్మయ్య.. బాగుంది:)

అశోక్ పాపాయి said...

continue malli eppudandi:-) mee titles bagunai nice

Ram Krish Reddy Kotla said...

మానస గారు చాలా బాగా రాశారు.. సో తరువాత ఇంట్లో తెలిసిపోయింది అనమాట .. సో ప్రేమలో కొంచెం సీరియస్ ఘట్టం మొదలవ్వబోతుంది అనమాట ..ఓ కే ..ఆ తర్వాతా ??

సవ్వడి said...

మంచి లవ్ స్టోరీ!

మానస said...

@నరేష్,

ఫార్ములా ఫాలో అయ్యి పెళ్ళి చేసుకోలేదండీ బాబూ :)

@అనానిమస్,
మీ కామెంటు నాకు సగం అర్ధం కాలేదు.తల్లి తండ్రులని మోసం చేసినా,చివరికి వారి ఆశీర్వాదంతోనే ఒక్కటయ్యాము కాబట్టి అవి మాకు తీపిగురుతులే.పెళ్ళి చేసుకోవడానికి భయంకరమయిన ప్రేమ అక్కర్లేదండీ,నమ్మకం ఉంటే చాలు

@పద్మప్రీత,
:)
@అశోక్,
కొత్త టపా రాసాను :)
@కిషన్,
అవును.బ్లాగు టైటిల్ మార్చాలేమో కొన్ని రోజులు ఆ ఘాటు గుర్తులు అని :).నిజంగానే.మా ఇంట్లో తెలిసిన తరువాత ఏమయ్యింది,నా బాధ,వాళ్ళ బాధ ఎక్సెట్రా ఎక్సెట్రా చెప్తాను వరుసగా.

@సవ్వడి,
ధన్యవాదాలండీ.ఇప్పుడు బాగా అనిపిస్తుంది కానీ నలుగురు మనుష్యులని చాలా క్షోభ పెట్టామండీ.నలుగురు ఎవరనుకుంటున్నారు?మా ఇరువురి పేరెంట్స్.
ఇప్పుడు అంతా బాగానే ఉన్నా...ఆ బాధ నన్ను వెంటాడుతూనే ఉంది

సవ్వడి said...

తప్పదు మరి...

గిరీష్ said...

naaku ee tapaa chala chala nacchindi.baga rasaru..

మానస said...

Thanks Girish gaaru for the comments in all the posts. Pl consider this as reply to all ur comments in my blog so far.

గిరీష్ said...

@manasa garu,
ya sure :)