
తరువాత తెలిసింది మాకు,ఆ కాలేజీ కి రికగ్నిషన్ లేదు అని.కాలేజీ వాళ్ళని అడిగితే వచ్చేస్తుంది అన్నారు.కానీ మేము భయపడి కాలేజీ మార్చుకుందామనుకున్నాము.ఒక 2-3 సార్లు కౌన్సెలింగ్ కి వెళ్ళడం ఏదో కారణాలతో అది క్యాన్సిల్ అవ్వడం.విసుగొచ్చింది నాకు.హీరో వాళ్ళ ఊర్లో ఉన్నా కానీ తనని కలిసే ప్రయత్నం చెయ్యలేదు నేను.
కౌన్సెలింగ్ లేటు అవుతోందని పోనీ ఒక్కసారి ఆ కాలేజీ కి వెళ్ళి చూడమ్మా అన్నారు నాన్న.అమ్మో నేను వెళ్ళను అన్నాను.బామ్మ కూడా పోనీ లేరా,దానికి కావాల్సిన కాలేజీ వచ్చేవరకు ఇక్కడే ఉంటుంది లే అంది.ఖాళీ గా ఉండటం ఎందుకని కంప్యూతర్ కోర్స్లు లో జాయిన్ అయ్యా.అప్పటికి నాకు కంప్యూటర్ అసలు ఎలా ఆపరేట్ చేస్తారో కూడా తెలీదు.
అలా క్లాసు లకి వెళ్ళి వస్తుండేదానిని.అప్పుడప్పుడు హీరో కనపడేవాడు.అయినా నెగ్లెక్ట్ చేసేదానిని.అప్పుడప్పుడు బామ్మ ఇంటికి కూడా వచ్చేవాడు.మెల్లిగా మాట్లాడటం మొదలెట్టా.ఇక అది ఎంత వరకు వచ్చింది అంటే,నా ఇన్స్టిట్యూట్ అయిపోయే సమయానికి రెడీ గా ఉండేవాడు నన్ను పికప్ చేసుకోవడానికి.నన్ను మా ఇంట్లో దింపి,మా పిన్ని(బాబాయ్ భార్య) కి చెప్పవాడు,మీ అమ్మాయి అలా రోడ్ మీద వస్తూ కనపడింది,లిఫ్ట్ ఇచ్చా అని.ఎవరికీ అనుమానం రాలేదు ఇంట్లొ.అయినా అసలు ఏమయినా ఉంటే కదా అనుమానం వచ్చినా భయపడటానికి.ప్రేమ దోమా లేకపోయినా ఇద్దరి మధ్యా,అలా పరాయి వాళ్ళ తో వస్తే బాగోదు అని నాకు కూడా తెలుసు.అందుకే రోజూ రావద్దు అని చెప్ప.
మెల్లిగా ఫోను మాట్లాడుకోవడం మొదలెట్టాము.మా బాబాయి భోజనం చేసి పడుకోగానే తనకి ఫోను చేసేదానిని.అప్పటికి సెల్ఫోను అన్న పదమే తెలీదు ఇంకా మన దేశం లో.ల్యాండ్ లైను లోనే కబుర్లన్నీ.మా బామ్మ లక్కీ గా ఊరు వెళ్ళడం వల్ల,రూం లో ఒక్కదానినే ఉండేదానిని.అందుకని నాకు ఇబ్బంది ఉండేది కాదు తనతో మాట్లాడటానికి.
మొదట్లో ఒక గంట మాట్లాడుకునే వాళ్ళము,ఒక వారం రోజులకి 2 గంటలు మాట్లాడే దాకా వచ్చాయి రాత్రిళ్ళు ఫోను కబుర్లు.
నాకు ఏమో తన మీద గత 6 సంవత్సరాల నుండీ ఉన్న ఇష్టం చెప్పెద్దామా అనిపించేది.కానీ భయం.
ఇద్దరమూ ఫోను మాట్లాడక పోతే ఉండలేనంత స్టేజ్ కి వచ్చాము.రాత్రి అలా నాతో కబుర్లు చెప్పినా మళ్ళీ పగలు మామూలుగా ఉండేవాడు అందరి ముందూ.
ఇంతలో న్యూ ఇయర్ వచ్చింది.ఎవరు ఫస్టు విషెస్ చెప్తారు అని పందెం పెట్టుకున్నాము.తనకి నేను ఫోను చేసా.ఫోను ఎత్తి గొంతు మార్చి హలో అన్నాడు.ఎవరికో చేసా అనుకుని,హెలో అన్నా నేను మళ్ళీ.అంతే,హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి,చూసావా నేనే గెల్చా అన్నాడు.ఎందుకో ఈ సారి అంత కోపం రాలేదు.
ఒక 3 రోజులలో బాంబు పేలబోతోందని తెలీదు గా నాకు మరి.
No comments:
Post a Comment