Friday, May 21, 2010

jan3rd

అర్ధ రాత్రి విష్ చెప్పినా కానీ మళ్ళీ పొద్దున్న మామూలుగా వచ్చి అందరికీ చెప్పినట్లే నాకూ చెప్పాడు,వెళ్తూ వెళ్తూ చెప్పాడు సాయంత్రం బయటకి వెళ్దాము,మీ పిన్ని కి చెప్పు అన్నాడు.మరి మా తమ్ముళ్ళు? అన్నాను.అందరినీ కాదు బయటకి తీసుకెళ్ళేది నిన్ను ఒక్క దానినే అన్నాడు.
హమ్మో,ఏమిటి ఈ పిల్లాడి ధైర్యం మా ఇంట్లో చెప్పి తనతో బయటకి వెళ్ళడమే,ఇంకేమన్న ఉందా అనుకున్నా.ఎంత ఫ్రెండ్స్ గా మమ్మల్ని ఆమోదించినా కానీ అలా వెళ్తే బాగోదు అని నాకు తెలుసు.


సాయంత్రం అయ్యింది.తను వస్తే బాగుండు,మాట్లాడచ్చు అనుకున్న.సాయంత్రం వచ్చి,ఏమిటి ఇంకా రెడీ అవ్వలేదు,పొద్దున్న చెప్పా గా అన్నాడు.నేను షాక్ ఏమిటి ఇలా అందరి ముందూ అని.

మా పిన్ని దగ్గరకి వెళ్ళి,తనని బయటకి తీసుకెళ్తా కాసేపు అన్నాడు.మా పిన్ని సరే అంది.నాకు భయం గానే ఉంది కానీ,అలాగే బయలు దేరా తనతో.

ఐస్ క్రీం పార్లర్ కి తీసుకెళ్ళాడు.ఏదో సుత్తి చెప్తాడు అంతే.ఏమయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అన్నాడు,అబ్బే ఏఅమీ లేదు అన్నాను.సరే,మరి త్వరగా తిను బయలుదేరుదాము అన్నాడు.


ఉసూరు మనుకుంటూ ఇంటికి వచ్చా.ఆరోజు రాత్రి మళ్ళా ఫోను కబుర్లు మామూలే.ఆ మరునాడు ఆదివారం.తనని చూడాలనిపిస్తోంది.కానీ ఎలా,క్లాసు కూడా లేదు.
ఇక ఉండ బట్టలేక సాయంత్రం మా అత్త వాళ్ళింటికి వెళ్ళా.అక్కడే ఉన్నాడు హీరో.నీ గురించే ఎదురు చూస్తున్నా అన్నాడు.చాలా టచింగ్ గా అనిపించింది.
మాట్లాడ దామంటే అందరూ ఉన్నారు.ఇక కాసేపటికి లేచా వెళ్తానని.

తను నాకు ఒక్కదానికి మాత్రమే వినపడేలా అన్న మాట ఆపేసింది నన్ను.
ఏమనుంటాడు,ఎనీ గెస్?





No comments: