నేను 10th లో ఉన్నాను అప్పుడు.ఏమిటో,10 వ తరగతి లోనే పడిపోయా ప్రేమలో.
మా మేనత్త కూతురి పెళ్ళి అని ఉత్తరం వచ్చింది.అసలే మా నాన్నగారు ఇంటికి పెద్ద కొడుకు,మేనమామ పెళ్ళికి వెళ్ళకపోతే ఎలాగ అనుకుంటూ ముందు అమ్మ తో మమ్మల్ని ఆ ఊరు పంపించారు.ఇప్పట్లాగ,మండపానికి ఒక 5-6 గంటల ముందు వచ్చినట్లు కాకుండా,పెళ్ళి కి ఒక రోజు ముందే మండపానికి చేరుకున్నాము అందరమూ.అందరితో కలిసి క్రికెట్ ఆడుతున్నా అప్పుడు(చిన్నప్పటి నుండీ టాంబాయ్ టైఫు లెండి కొంచం).కొట్టిన బాల్ కింద పడింది వెళ్ళి తన బౌలింగ్ అప్పుడు.బాల్ తీసుకురా అన్నాడు.నువ్వే తెచ్చుకో అన్నా విసురుగా.ఎక్కడ పడిందో తెలుసా బాల్ అంటూ అలా చెయ్యి పట్టుకుని తీసుకు వెళ్ళాడు కిందకి.అంతే,నిజ్జం.....అలా పడిపోయా నేను.
ఇంక అంతే,ఏదో అలజడి మొదలు నాలో.అప్పటివరకు తనతో మామూలుగా మాట్లాడిన నేను,అప్పటినుండీ తనని చూడగానే కొత్తగా అనిపించేది మనసుకి,తనతో నే ఉండి మాట్లాడాలి ఇలా ఏంటెంటో పైత్యపు ఊహలు వచ్చేవి.ఇంతలో పెళ్ళికూతురు(మా అత్త కూతురు)ఫ్యాన్సీ షాపు కి వెళ్ళి ఏదో తీసుకురమ్మంది తనని.నేను వెళ్తా అని బయలుదేరా.నీకేమీ తెలీదు నువ్వుండు అంటూ మా అక్కని పంపారు.ఛా,ఛాన్స్ మిస్ అనుకున్నా.ఇప్పుడు నవ్వు వస్తుంది.తనతో ఒక్కదానినే మాట్లాడే చాన్స్ వచ్చి ఉంటే ఏమి మాట్లాడేదానిని అని.
భోజనాలప్పుడు తన పక్కన కూర్చుందామన్నా కాని ఎవరో చటుక్కున వచ్చి కూర్చునేవారు.చిరాకు,పరాకు అన్నీ ఏంటో తెలీని ఫీలింగ్స్.
పెళ్ళి బిజీ లో పడి మర్నాడు కుదరలేదు మాట్లాడటం.ముహూర్తం అయ్యాకా,అందరూ కాస్త రిలాక్స్ అవుతున్నప్పుడు వెళ్ళి అడిగా నాకు ఆకలేస్తోంది భోజనం చేద్దామా అని.ఇందాకే గా టిఫిన్ తిన్నావు,అప్పుడే ఆకలా అంటూ అందరికీ చెప్పి నవ్వేసరికి ఉక్రోషం వచ్చేసింది నాకు.ఇంతలో భోజనాల వేళ అయ్యింది.
ఏమీ తినాలనిపించటం లేదు భోజనానికి కూర్చున్నానే కాని.ఏదో అలా కెలికి అయ్యిందనిపించాను.అదేమిటే అలా సగం సగం తింటావు,ఇందాకేమో ఆకలో అన్నావు అని మా బామ్మ ఒక కేక వేసింది తన కంచు కంఠం తో.ఏంటొ అత్తయ్యగారూ,ఇంకో 2 నెలల్లో పరీక్షలు పెట్టుకుని పెళ్ళికి రాను అని అన్నా కానీ నేనే తీసుకొచ్చా,ఆడపిల్లని ఎక్కడ వదుల్తాము అని.అదే పరాకు అనుకుంటా,నేను కనుక్కుంటా లెండి అని అమ్మ బామ్మ చేవిలో అనడం వింటూనే ఉన్నాను.
మొత్తానికి నాకు తనతో మాట్లాడే చాన్స్ రాకుండానే మా ఊరు తిరిగొచ్చాము.ఇంక అప్పటినుండీ నరకం మొదలు నాకు.ఒక పక్క చూస్తే 2 నెలలలో పరీక్షలు.మనసు ఏమో ఎక్కడో ఉంటోంది.
చా,నేను ఏమిటి ఇలా అయిపోయాను,నాకు ప్రేమ దోమా ఏమిటి అనుకుంటూ మళ్ళీ చదివాను.ఎంత ట్రై చేసిన తనని మాత్రం మనసులో నుండి తీసెయ్యలేకపోయాను.
మొత్తానికి 10th క్లాస్ పరీక్ష లయ్యాయి.హమ్మయ్య శెలవలకి మా అత్త వాళ్ళ ఊరు వెళ్లచ్చు అనుకుంటుందగానే,మొన్ననే గా వెళ్ళాము ఇప్పుడు మళ్ళీ వద్దు అని అమ్మ నా ఉత్సాహాన్ని నీరు గార్చేసింది.చేసేదెముంది,అలా మనసులో రేగుతున్న అలజడి ని ఎవరికీ చెప్పుకోలేక నరకం అనుభవించా.గట్టిగా ఏడ్చెయ్యాలి అనిపించేది ఎవరికయినా చెప్పి ఈ బాధ.కానీ ఇంట్లో చంపెస్తారు అని తెలుసు ప్రేమ దోమ,ఈగ
అంటే.
ఇంతలో రిజల్ట్స్ వచ్చాయి.
ఇక ఇంటర్ ఎక్కడ జాయిన్ చెయ్యాలి అని తర్జన భర్జనలు మొదలు .ఉన్న ఊళ్ళో ఏమో ఒకే ఒక గవర్నమెంటు కాలేజీ ఉంది.దానిలో చదువులు అంతంతమాత్రమే.
ఎందుకు వచ్చిన గొడవలే అని నన్ను తీసుకెళ్ళి హాస్టల్ లో పడేసారు.మరొక గోల మొదలు నా జీవితంలో.
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
బావుంది, తరవాతేమయ్యింది....ఆ అబ్బయిని మళ్ళీ ఎప్పుడు కలిసారు?
మీ పాలకోవా ఫొటో మాత్రం నోరూరిస్తోందండీ, అసలే నాకు పాలకోవా అంటే పిచ్చి.
బావుంది. ఇంకా చెప్పండి.
వావ్...చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది మీ ప్రేమ కథ..ఆ ఏజ్ లో మొదలయ్యే ప్రేమ చాల స్వచ్చంగా..నిస్వార్ధంగా..ఎంతో మధురంగా ఉంటుంది..తర్వాతా ఏమైందో త్వరగా చెప్పండి..నా బ్లాగ్ లో కూడా ఓ ప్రేమ కథ రాస్తున్న(కేవలం కథే)..ఓ లుక్కేయండి :-)
meeru chesaraa aa palakovaa??chustene tinaalanipistundi..
సుభద్ర గారూ,
నాకు పిండి వంటలు రావండీ బాబూ.
Post a Comment